నంగునూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న బడి బాట కార్యక్రమానకి మంచి స్పందన వస్తోంది. చాలా మంది వారి పిల్లల్ని అంగన్వాడీల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రోజున సిద్దన్నపేట గ్రామంలో సర్పంచి కనకవ్వ, ఎంపీటీసీ బెదురు తిరుపతి అధ్వర్యంలో పలువురు పిల్లలు అంగన్వాడీ 1,2 కేంద్రాల్లో చేరారు. సర్పంచి కనకవ్వ, ఎంపీటీసీ బెదురు తిరుపతి,రైతు బంధు సమితి సభ్యుడు మల్లేష్, కార్యదర్శి రవి, అంగన్వాడీ టీచర్లు భవాని లావణ్య తదితరులు ఉన్నారు.
బడి బాటకు మంచి స్పందన




