*అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం*

మునగాల, జూన్ 8(జనంసాక్షి): శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం 9వ వార్షికోత్సవం సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్య స్వామి పూజ, అయ్యప్ప స్వామి అభిషేకాలు ఘనంగా నిర్వహించడం జరిగినది. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లపాటి శ్రీనివాస్, వంగవీటి వెంకట గురుమూర్తి, పెనుగొండ దుర్గాప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు తడకమళ్ళ శ్రీనివాసాచారి, పల్లె సాగర్ రెడ్డి, వొల్లోజు వెంకన్న, పుల్లారెడ్డి, మాజీ చైర్మన్ దేవినేని రవి, ఆలయ అర్చకులు నారమనేని రామారావు తదితరులు పాల్గొన్నారు.