Friday, 6 November 2026

అరబిందో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన

శ్రీకాకుళం,నవంబర్‌17(జ‌నంసాక్షి): అరబిందో కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని స్థానికులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని లేకపోతే ప్రజల మద్దతుతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్బంధిస్తామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు హెచ్చరించారు. శనివారం గ్రామ కార్మిక సంక్షేమ కమిటీల ఆధ్వర్యంలో సరగడపేట, నారువ, మెంటాడ, పైడి భీమవరం, సంచాము, ముక్కుపాలవలస, కనిమెల్ల, కామవరం, లంకలపల్లిపాలెం, అల్లాడపాలెం, గోవిందపురం, చింతపల్లి గ్రామాల్లో గ్రామదీక్షలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ.. అరబిందో యాజమాన్యానికి చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ ఇచ్చి 8 నెలలు గడిచినా నేటికీ పరిష్కరించకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అరబిందో యాజమాన్యం కార్మికుల వేతనాలు పెంచకపోవడంతో కార్మికుల కుటుంబాలు దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల శ్రమతో కోట్లాది రూపాయలు లాభాలార్జిస్తున్న యాజమాన్యం కార్మికుల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. గ్రామాల్లో ఉన్న స్థానికులకు ఉద్యగాలు వెంటనే ఇవ్వాలని, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులతో గ్రామలను అభివఅద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. అరబిందోలో 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను నేటికీ కాంట్రాక్టు కార్మికులుగానే కొనసాగించడం దుర్మార్గమన్నారు. కాంట్రాక్టు కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి, కార్మికుల డిమాండ్స్‌ వెంటనే పరిష్కరించాలని లేకపోతే ప్రజలు మద్దతుతో పోరాటాలను ఉధఅతం చేస్తామని గోవిందరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, సిహెచ్‌.అమ్మన్నాయిడు, అరబిందో ఫార్మా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కె.గురునాయుడు, ఎస్‌. సీతారామరాజు, ఎల్‌.రాంబాబు, టి.శంకరరావు, ఎస్‌.అప్పలరాజు, ఐ.వెంకటరమణ, పి.వెంకటప్పారావు, బి.శ్రీనివాసరావు, బి.సంతోష్‌, యం.సూర్యారావు, ఎన్‌.తారకేశ్వరరావు, సిహెచ్‌. నరసింహులు, బి.బంగార్రాజు, రామిరెడ్డి, సుందర్‌, వి.నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.