Friday, 6 November 2026

22న ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం

విజయవాడ,నవంబర్‌17(జ‌నంసాక్షి): కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 న కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కోటేశ్వరమ్మ శనివారం ప్రకటించారు. దేవస్థానం పరిధిని 5 సెక్టార్లుగా విభజించి, అందులో రంగు రంగుల ముగ్గులతో పాటు దేవతామూర్తులు, శివలింగాకారం, త్రిశూలం, ఓంకారం వంటివి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ రోజు నిర్వహించనున్న పాలకవర్గం భేటీ అజెండా ముందుగా చెప్పకపోవడంపై పాలకమండలి సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.