Friday, 6 November 2026

పర్యావరణం కోసం ప్లాస్టిక్‌ను దూరం పెడదాం

ఒంగోలు,నవంబర్‌17(జ‌నంసాక్షి): పర్యావరణాన్ని పరిరక్షించడం పౌరులుగా మన బాధ్యతని గుర్తించాలని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్‌ డివిఎస్‌ నారాయణరావు అన్నారు. పర్యావరణ విఘతం జరిగేలా

విపరీత ప్లాస్టిక్‌ వాడకం నిషేధం జరగాలన్నారు. రోటరిక్లబ్‌ సింగరాయకొండ ఆధ్వర్యంలో అద్దంకి పట్నంలోని ఎన్టీఆర్‌ కాలనీలో శనివారం గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పంచాయతీ కమిషనర్‌ డివిఎస్‌ నారాయణరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పట్నంలో ప్లాస్టిక్‌ నిషేధం జరిగిందని, ప్రజలు గుడ్డ సంచులను మాత్రమే వినియోగించాలని కోరారు. రోటరి క్లబ్‌ తమ వంతు సహాయ సహకారాలు అందించడంలో ముఖ్య పాత్ర పోషించటం గర్వించదగ్గ విషయమని నారాయణరావు పేర్కొన్నారు. ఇప్పటికే వేల గుడ్డ సంచులను రోటరీ క్లబ్‌ ద్వారా ప్రజలకు, పలు కాలనీ వాసులకు అందించడం అభినందనీయమని ఆయన చెప్పారు. రోటరీ క్లబ్‌

అధ్యక్షులు ఊటుకూరి రామకోటేశ్వరరావు దాతల సాయతో పర్యావరణాన్ని పరిరక్షించడంలో, గుడ్డ సంచులను ప్రజలకు పంపిణీ చేయడంలో వారి పాత్ర ఎంతో కీలకమైందని కొనియాడారు.