అరసవల్లిలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ

స్వామిని తాకిన సూర్యకిరణాలు

అరసవిల్లి,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం ఆవిస్కృతమైంది. మూడేళ్ల తర్వాత సూర్యకిరణాలు ఏడు నిమిషాల పాటు స్వామివారిని తాకాయి. ఆదిత్యుని పాదాలను స్పృశించేందుకు భానుడు చేసిన ప్రయత్నానికి గత మూడేళ్లుగా మేఘాలు అడ్డుపడుతున్నాయి. దీంతో ఏటా ఇక్కడికి వస్తున్న భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే మంగళవారం ఉదయం 6 గంటల 6 నిమిషాల సమయంలో స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు బంగారం ఛాయ లేలేత కిరణాలు తాకాయి. దీంతో భక్తులు ఆనందోత్సాహాల తో పరవశించారు. ఏటా ఉత్తరాయనం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో ఈ కిరణ స్పర్శ భాస్కరుడిని తాకుతుంది. స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా భక్తులను కనువిందు చేస్తోంది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, వేరే రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం మార్చి నెల 9, 10, అక్టోబరు 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు మూలవిరాటును తాకుతాయి. మంగళవారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఈ అద్భత దృశ్యాన్ని తిలకించి పరవశించిపోయారు. భక్తుల రాకను దృష్టిలో పటెట్‌ఉకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అధికారులు కూడా పలువురు ఇక్కడికి వచ్చి సుందర దృశ్యాన్ని తిలకించి స్వామి సేవలో పులకించారు.

 

 

తాజావార్తలు