Wednesday, 4 November 2026

అర్ధరాత్రి హీరో, అతడి స్నేహితులు హల్చల్

హైదరాబాద్:  టాలీవుడ్ ప్రముఖ యువహీరో తన మిత్రులతో కలిసి శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్లోని రహదారిపై హల్చల్ చేశాడు. ఆర్థరాత్రి రహదారిపై గొడవేంటంటూ స్థానికులు హీరో ఆయన మిత్రులను ప్రశ్నించారు. దాంతో వారు రెచ్చిపోయారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా ? అంటూ స్థానికులపై వారు దౌర్జన్యానికి దిగారు. వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. అంతలో అక్కడే నివాసం ఉంటున్న ఐపీఎస్ ఉన్నతాధికారి వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు.

పోలీసులు జూబ్లిహిల్స్ చేరుకుని… స్థానికులను శాంత పరిచి.. హీరో అతడి స్నేహితులను మందలించారు. అనంతరం వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ ఘటనలో యువ హీరోతోపాటు మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కుమారులు ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *