అర్హులకు రేషన్ కార్డులు : మంత్రి ప్రత్తిపాటి
గుంటూరు,ఆగస్ట్13(జనం సాక్షి): ఈ నెలాఖరుకు రేషన్ సమస్యలను పరిష్కరించి 2.52 లక్షల నూతన కార్డులను పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు అందచేస్తామని అన్నారు. గుంటూరువారితోటలో రేషన్ దుకాణాన్ని ఆకస్మీకంగా తనిఖీ చేసి కార్డుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వేలిముద్రలు పడని వారికి ఇంటికి వెళ్ళి సరుకులు ఇవ్వాలని సూచించారు. గతంలో రద్దయిన 2.35 లక్షల యూనిట్లకు సెప్టెంబర్ లో సరుకులు అందిస్తామన్నారు. రేషన్ దుకాణాల ద్వారా పామాయిల్, ఉప్పు అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి కనీసం ఒక్క అన్న క్యాంటీన్‌ను అయిన ఏర్పాటు చేస్తామన్నారు