అర్హులైన వారందరికీ పట్టాలు అందించాలి– పోడు సర్వే పరిశీలించిన జెడ్పీ చైర్మన్ కోరం

టేకులపల్లి, నవంబరు 3 ( జనం సాక్షి): పోడు భూముల పట్టాలు అర్హులైన వారందరికీ అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అధికారులను ఆదేశించారు. తెలంగాణా రాష్ట్రంలో పోడు భూముల సర్వే ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం టేకులపల్లి మండలంలోని కోయగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోడు భూముల సర్వే ప్రక్రియనుపరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు,కమిటీ సభ్యులు నిస్పక్ష పాతంగా వ్యవహరించి అర్హులైన వారందరికి పట్టాలు అందేలా చూడాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోరం ఉమా సురేందర్, ఉప సర్పంచ్ నెల్లూరి పుష్పావతి,పంచాయతీ సెక్రటరీ వసంతరావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సున్నం నాగేష్,నూకల రమేష్, వడ్డే అంజయ్య,వడ్డే వెంకన్న,కంగల అనీల్,ఈసం శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు