అల్మాస్ కుంట వద్ద నాలా పనులు ప్రారంభం
బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో 110 కోట్లతో నిర్మించనున్న ఎస్ఎన్ డిపి ప్రాజెక్టులో భాగంగా ఆల్మాస్ కుంట వద్ద నాలా పనులను మేయర్ సామల బుచ్చిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ముందుగా వరద తాకిడికి తట్టుకునేలా అల్మాస్ కుంట నీటిని దారి మళ్ళిస్తే పైనుండి వచ్చే నీరు కాలనీలో నిలువ ఉండదని పేర్కొన్నారు. త్వరగా మిగిలిన ప్రాంతాల్లో కూడా నాలా పని పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.