Wednesday, 4 November 2026

అల్వాల్‌లో విద్యార్థిని అదృశ్యం

హైదరాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): అల్వాల్‌ భూదేవి నగర్‌లో ఓ విద్యార్థిని అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగలవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని సంగీత(13) ఇంటికి తిరిగి రాలేదు. విద్యార్థిని అదృశ్యంపై అల్వాల్‌ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని పాఠశాల లోనికి, బయటకువెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి. పాఠశాలలో సంగీత కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు నిర్దారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంగీత ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లిందీ..ఎవరైనా తీసుకుని వెళల్‌ఆరా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.