అవకాశం ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా
విూడియా సమావేశంలో పవన్ కళ్యాణ్
విశాఖపట్టణం,మే18(జనం సాక్షి ): ప్రజలు అవకాశం ఇస్తే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ శుక్రవారం విూడియాతో మాట్లాడారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు అమలు చేయకపోవడంతోనే తాను ప్రజల్లోకి వచ్చానని పవన్ పేర్కొన్నారు. అలాగే అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరికాదని ఆయన అన్నారు. గంగవరం పోర్టు నిర్వాసితులకు అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హావిూ ఇచ్చారు. గంగవరం పోర్టు నిర్వాసితులతో ముఖాముఖిలో పాల్గన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గంగవరం పోర్టు నిర్వాసితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పవన్ మాట్లాడుతుండగా అక్కడున్న పవన్ అభిమానులు, స్థానికులు సిఎం.. సిఎం అంటూ నినాదాలు చేయడంపై స్పందించిన ఆయన విూరు సిఎం అని నినాదాలు చేయడం ద్వారా గంగవరం పోర్టు కాలుష్యం తగ్గదంటూ తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు. ఎన్నికల సమయంలో హావిూలు ఇచ్చిన నేతలు ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. మాటతప్పిన ఎమ్మెల్యేలను గ్రామాల్లోనికి రానీవకుండా సమస్యలపై నిలదీయాలని పిలుపునిచ్చారు.
———–