Friday, 6 November 2026

మేయర్‌ దంపతులపై పర్యావరణ కేసు

థానే,మే18(జ‌నం సాక్షి ):  పర్యావరణ నిబంధనలు అతిక్రమించిన కేసులో మిరా భయందర్‌ మున్సిపాలిటీ మేయర్‌ డింపుల్‌ మెహతా భర్తతోపాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదైంది. నవ్‌గర్‌ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో క్లబ్‌ హౌజ్‌ నిర్మాణానికి సంబంధించి చెట్లను నాశనం చేసి, భూమిని అక్రమంగా ఆక్రమించి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన విషయంలో రెవెన్యూ అధికారులు మేయర్‌ భర్త వినోద్‌ మెహతా సహా 8 మందిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిరా రోడ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో బీజేపీ ఎమ్మెలే నరేంద్రమెహతా సోదరుడు ప్రశాంత్‌ కెలుస్కర్‌, రజనీకాంత్‌ సింగ్‌, ఫ్లాట్‌ యజమానులు ఉన్నారు. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్‌ లేదని, దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
———–