Friday, 6 November 2026

జగన్‌కు టిడిపి నిరసన నినాదాలు

ఏలూరు,మే18(జ‌నం సాక్షి ): వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డికి పశ్చిగోదావరి జిల్లా ద్వారాక తిరుమల మండలం, మారంపాలెంలో వింత అనుభవం ఎదురైంది. శుక్రవారం జగన్‌ పాదయాత్ర చేస్తుండగా టీడీపీ ఫ్లెక్సీలతో కార్యకర్తలు నినాదాలు చేశారు. అబద్దాలు చెప్పేందుకు వచ్చారంటూ టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. డాబాలపై నుంచి టీడీపీ జెండాలు ఊపుతూ కార్యకర్తల నినాదాలు చేశారు. చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలు… అద్భుతంగా అమలు చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు బ్యానర్లు ఏర్పాటు చేసి… ఎవరు ఏమి చేశారో చర్చకు రావాలంటూ సవాల్‌ విసిరారు.