Tuesday, 3 November 2026

అవసరమైతే మరోమారు సర్జికల్‌ దాడులు

లెప్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) డి.హెస్‌ హుడా

న్యూఢిల్లీ,జూన్‌29(జనం సాక్షి): పాకిస్థాన్‌కు మరోసారి గట్టి బుద్ది చెప్పాలని భావిస్తే మళ్లీ వారిపై సర్జికల్‌ దాడులకు వెనుకాడేదిలేదని లెప్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) డి.హెస్‌ హుడా అన్నారు. 2016 సెప్టెంబర్‌ 28-29 మధ్య రాత్రి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై ఇండియన్‌ ఆర్మీ సర్జికల్‌ దాడులు హుడా పర్యవేక్షణలో జరిగాయి. శుక్రవారంనాడిక్కడ విూడియాతో హుడా మాట్లాడుతూ, 2016లో ఉగ్రశిబిరాలపై దాడులు జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, అందుకు సైన్యం అంగీకరించిందని చెప్పారు. ‘అంతిమంగా నిర్ణయం రాజకీయ నాయకత్వం నుంచే వచ్చింది. పాకిస్థాన్‌ మరోసారి గట్టి సందేశం ఇవ్వాలని ఇండియా కోరుకుంటే తప్పనిసరిగా ఆర్మీ ఆ పని చేస్తుంది’ అని జనరల్‌ హూడా తెలిపారు.పీఏకేలో బంకర్లు, మిలటరీ, ఉగ్రవాద స్థావరాలను భారత ప్రత్యేక దళాలు పేల్చి వేస్తున్న 8 నిమిషాల నిడివి గల వీడియోను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. కాగా, ఈ ఆపరేషన్‌ను ఉదంపూర్‌లోని కంట్రోల్‌ రూమ్‌ నుంచి మానిటర్‌ చేసినట్టు జనరల్‌ హుడా తెలిపారు. పాకిస్థాన్‌ ఆర్మీ పోస్టులకు దగ్గరగానే ఉగ్రవాదుల క్యాంప్‌లు ఉండటం భద్రతా దళాలు ఎదుర్కొన్న ప్రధాన సవాలని ఆయన చెప్పారు. మొత్తం ఆపరేషన్‌ 6 గంటల్లో ముగిసిందని హుడా వివరించారు.