కెజిహెచ్‌లో వార్డులను పరిశీలించిన కలెక్టర్
విశాఖపట్టణం,జూన్29(జనం సాక్షి): విశాఖ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ కేజీహెచ్‌లోని అన్ని వార్డులను పరిశీంచారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ వార్డు పక్కన ఉన్న ప్రత్యేక సెల్‌లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని పరామర్శించారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? అని ఆరా తీశారు. అయితే ఆ వ్యక్తి వివరాలు తెలిసి అవాక్కయారు. ఆయన పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత చెంగల వెంక ట్రావు అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఓ హత్య కేసులో ఏ-1 ముద్దాయిగా ఉన్న చెంగల జీవిత ఖైదుగా శిక్ష అనుభవిస్తూ అనారోగ్యంతో వారం రోజులుగా కేజీహెచ్ లోని సెల్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారని తెలుసుకున్నారు. ఆయనకు బెయిల్ రాలేదా అని వాకబు చేశారు.