అవార్తలు అవాస్తవం

కర్ణాటక సీఎం పదవిపై డీకే శివకుమార్  వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కాంగ్రెస్ తరపున కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. కుమారస్వామి సీఎం కావడం పట్ల కాంగ్రెస్‌లో ఎవరూ అసంతృప్తితో లేరని, తామంతా ఒక్కటేనని ఆయన చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రావడంతో అంతా ఆనందంగా ఉన్నామన్నారు. కర్ణాటక సీఎం పదవిపై తాను ఆశలు పెట్టుకున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని ఆయన చెప్పారు. తానెప్పుడు అలా చెప్పలేదన్నారు. అంతా సజావుగానే ఉందని డీకే శివకుమార్ తెలిపారు.