నెల్లూరు: అవిశ్వాసమంటే అర్థం తెలియని వారు దాని గురించి మాట్లాడటం అవివేకమని వైకాపానుద్దేశించి తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో వ్యాఖ్యానించారు. షర్మిల పాదయాత్ర గురించి స్పందిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆమె పాదయాత్ర చేపట్టాలని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు.




