Thursday, 5 November 2026

ఉద్యోగ నియామక పక్రియలో సాంకేతిక లోపాలు

సర్వీస్‌ కమిషన్‌ సైట్‌ తీరుపై నిరుద్యోగుల ఆందోళన

హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చేపట్టిన ఉద్యోగ నియామక పక్రియలో సాంకేతిక సమస్యలు అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో వీరు ఆందోళనకుగురవుతున్నారు. వీఆర్‌వో, గ్రూపుా4 ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపుల్లో మూడు రోజులుగా అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఖాతాల్లో నగదు కట్‌ అయినప్పటికి ఫీజు చెల్లించినట్టు టీఎస్‌పీఎస్‌సీ నుంచి నిర్దారణ రావడం లేదు. కొందరైతే రెండు మూడు సార్లు ఫీజు చెల్లించారు. కొందరు ఎన్నిసార్లు యత్నించినా ఫీజు చెల్లింపు జరగడం లేదు. వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదుల మేరకు సాంకేతిక సమస్యను సరిదిద్దినట్లు టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది. రెండు సార్లు అభ్యర్థులు చెల్లించిన ఫీజును వారి ఖాతాల్లోనే జమచేస్తామని స్పష్టం చేసింది. అయితే వెబ్‌సటై/ా నిర్వహణ తీరుపై నిరనుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.