Tuesday, 3 November 2026

అస్సాం : పోలీసు కాల్పుల్లో 8 మంది మృతి

గోల్పారా : అస్సాంలో స్థానిక ఎన్నికలను వ్యతిరేకిస్తున్న గిరిజనులకు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతికి 120 కి.మీ. దూరాన ఉన్న గోల్పారా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. గిరిజనులు పంచాయతీ ఎన్నికలను నిరసిస్తూ అధికారులపై తిరగబడంతో కాల్పులు జరపాల్సి వచిందని పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న రాభా అనే తెగ స్వయంపాలన కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *