హైదరాబాద్,అక్టోబర్31(జనంసాక్షి): ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేస్తారని వస్తున్న వార్తల పట్ల ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలను మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఓవైసీ ఆరోపించారు. నాలుగేళ్లుగా దేశంలో ఇదే జరుగుతోందని ఆయన అన్నారు. ఒకవేళ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేస్తే, ఆర్బీఐలో మోదీ జోక్యం చేసుకున్నట్లే అని, ఈమధ్యే సీబీఐ చీఫ్‌ను తొలగించారని, ఇక ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆర్బీఐని కూడా నాశనం చేస్తోందని ఓవైసీ ఆరోపించారు. ఉన్నత సంస్థలను నిర్వీర్యం చేయడం తగదన్నారు.




