– మరో 15రోజుల్లో అమల్లోకి
– జిల్లాల వారీ రిజిస్టేష్రన్ రద్దు
– విలేకరుల సమావేశంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, అక్టోబర్31(జనంసాక్షి) : ఆంధప్రదేశ్ లో జిల్లాల వారీగా రిజిస్టేష్రన్ కోడ్ లను ఎత్తివేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం అమరావతిలో ఆదరణ -2 పథకం అమలను మంత్రి సవిూక్షించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే కోడ్ తో వాహనాల రిజిస్టేష్రన్ చేపడతామని వెల్లడించారు. 39నంబర్ సిరీస్ తో మరో 15రోజుల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. తాజాగా ఆర్టీసీని ఆదుకునేందుకు రూ.335 కోట్లు కేటాయించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. చేతివృత్తుల వారికి కోరుకున్న విధంగా అత్యాధునిక పనిముట్లు అందజేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. లబ్ధిదారులకు ప్రస్తుతం పనిముట్లపై 20శాతం రుణమాఫి అందజేస్తున్నామని వెల్లడించారు. చేతివృత్తులు చేపట్టే వ్యక్తులు 10శాతం కంట్రిబ్యూషన్ చెల్లిస్తే, మిగిలిన 90శాతం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద భరిస్తుందని పేర్కొన్నారు. ఆదరణ-2 పథకంలో భాగంగా తొలివిడతలో 2 లక్షల మందికి పనిముట్లను అందజేస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 5లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, నాలుగు లక్షల మంది ముందుకొచ్చారని వెల్లడించారు. వచ్చే నెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల విూదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆదరణ-2 పథకం రెండో దశను కూడా నవంబర్ లోనే ప్రారంభిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.




