– అందులోనే పైశాచిక ఆనందం పొందుతున్నాడు
– నాలుగేళ్లు చేతులు కట్టుకొని.. కేంద్రంపై ఇప్పుడు ఎగిరితే ఏంలాంభం?
– బాబుకు రాయలసీమ పేరెత్తే అర్హత లేదు
– జేసీ దివాకర్‌రెడ్డిని రాయలసీమ నుంచి బహిష్కరించాలి
– వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్31(జనంసాక్షి) : దుండగుడిదాడితో గాయంతో చికిత్స పొందుతున్న జగన్‌ను పరామర్శించాల్సిన చంద్రబాబు నాయుడు.. ఇష్టమొచ్చినట్లు జగన్‌పై మాట్లాడుతున్నాడని, చంద్రబాబు నీకు అంత పైశాచిక ఆనందం ఎందుకని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.. పక్కనున్న ఆరు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు పెట్టి బలవంతంగా జనాన్ని కడపకు తరలించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి తెలిసిందల్లా అధర్మం, అన్యాయం మాత్రమేనని దుయ్యబట్టారు. కేవలం జగన్‌ని టార్గెట్ చేసుకునే సభ జరిగిందని, జగన్‌పై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా, అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో కరవుతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒక్క మాట మాట్లాడలేదని తప్పుబట్టారు. చంద్రబాబు కేంద్రం ఏం చెబితే అదే నిజం అని చంకలు గుద్దుకుంది నిజం కాదా అని సూటిగా అడిగారు. అప్పుడే ఎందుకు నోరు మెదపలేదని సూటిగా ప్రశ్నించారు. నాలుగేళ్లు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నావని ప్రశ్న లేవనెత్తారు. రాజకీయాలు మాట్లాడటానికే సభ నిర్వహించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తిట్టిన నోటితోనే పొగుడుతావ్.. మోదీని పొగిడిన నోటితోనే తిడుతున్నావ్..ఎన్నిసార్లు యూటర్న్ తీసుకుంటావని ధ్వజమెత్తారు. చంద్రబాబు నీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టావో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని రాయలసీమ ప్రజలందరూ బహిష్కరించాలని కోరారు. కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబుకు అవగాహన ఉందా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఎలాగూ వచ్చేసారి సీఎం కాలేరు కాబట్టి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు రాయలసీమ పేరెత్తే అర్హత లేదని, కడప ప్రజల్ని రౌడీలు, గూండాలు అని సంబోధించిన చంద్రబాబూ ఎలా కడప జిల్లాకు వస్తారని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్‌కు నార్కో అనాలసిస్ పరీక్ష చేస్తే నిజాలు వెల్లడవుతాయని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.




