అసలు నిజాలు మాట్లాడం అలవర్చుకోండి
పరిపూర్ణానందపై మండిపడ్డ కర్నె ప్రభాకర్
హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): పరిపూర్ణానంద ప్రవచనాలు చెప్పుకుంటే మంచిది…ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. ఆయన అప్పుడే సిఎం అయిపోయినంతగా ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో కర్నె ప్రభాకర్
విూడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయుష్మాన్భవ పథకం కంటే అద్భుతమైన ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో అమలు అవుతోందని తెలిపారు. మార్చురీ నుంచి శవాలను తరలించే వాహనాలను ఏ రాష్ట్రంలోనైనా అమలు చేశారా? ఆ విషయం స్మృతి ఇరానీ చెప్పాలని కర్నె డిమాండ్ చేశారు. కేంద్రం ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ ¬దా ఇచ్చిందా అని ప్రశ్నించారు. బీజేపీలో నేతలు లేరా? ఆంధ్రా నాయకులతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. మతాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. తాను ముఖ్యమంత్రి అవుతానంటూ స్వామి పరిపూర్ణానంద పగటి కలలు కంటున్నారని విమర్శించారు. మతాలపై ఆధారపడిన పార్టీ బీజేపీ. బీజేపీ నేతలు మరో స్వామిని ఎన్నికల్లోకి తీసుకువచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు పరిపూర్ణానంద అబద్దాలు చెప్పకూడదు. ఆంధ్రా ప్రవచనాలను తెలంగాణ విూద రుద్దుతే ఊరుకునేది లేదన్నారు. బీజేపీ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేవిూ లేదన్నారు. విభజన హావిూలపై పార్లమెంట్లో నిలదీసినా పట్టించుకోలేదన్నారు. హైకోర్టును విభజించమంటే కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరానికి జాతీయ ¬దా ఇవ్వడం లేదు. ఓట్ల కోసం బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని తేల్చిచెప్పారు. ఇవన్నీ కప్పిపెట్టి అధికారం మాదే అంటున్న వారికి ప్రజలు ఎలా ఓట్లేస్తారని ప్రశ్నించారు.




