Wednesday, 4 November 2026

సుబ్రమణెళ్యిశ్వర ఆలయంలో కార్తీక సందడి

8న ఆలయంలో మండలదీక్ష

విజయనగరం,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాలో ప్రముఖ దేవాలయం స్థానిక పూలబగ్‌లో వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే కార్తీకమాస సుబ్రహ్మణ్య స్వామి మాలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ ఏడాది కూడా ఘనంగా కావడి ఉత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కర్రీ వెంకట రమణ సిద్ధాంతి తెలిపారు. సోమవారం కోవెల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాల ధారణ కార్యక్రమం ఈ నెల 8 వతేదీన దేవాలయంలో మొదటగా మండల దీక్ష, అలాగే 29న అర్ధ మండల దీక్ష, అలాగే డిసెంబర్‌ 8 న ఏకాదశ దీక్ష లు ఉంటాయి అని తెలిపారు. అలాగే డిసెంబర్‌ 9 న అత్యంత వైభవంగా కావడి ఊరేగింపు అనేక సాంస్కృతిక, కళ ప్రదర్శనలతో ఉంటుంది అని తెలిపారు. మాల ధారణ వేసే భక్‌త్తులు ఎటువంటి అపోహలు నమ్మవద్దని మిగత విషయాలు కోసం ఆలయంలో సంప్రదించాలి అని తెలిపారు. ఈ ఏడాది కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు అన్న అంచనా మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు , ప్రజలు పొల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి ప్రెసిడెంట్‌ బేత కృష్ణారావు, దన్నాన రముమూర్తి, జగన్నాద రెడ్డి, సతీష్‌, ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, ఆగస్య శర్మ, ఆర్‌.వి.పంతులు, శ్రీనివాస గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.