Tuesday, 3 November 2026

ఎర్రబెల్లి కి కడియం శ్రీహరి సవాల్

kadium srihari fire on Errabelli Dayakar rao

వరంగల్ : సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు దమ్ముంటే చంద్రబాబుతో ఏపీ ఉద్యోగులకు 43 శాతం పీఆర్‌సీ ఇప్పించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సవాల్ చేశారు. ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు టీ టీడీపీ నేతలకు లేదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్న వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *