మిర్యాలడూడ: ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది, నల్గొండ జిల్లా మిర్యాలగూడ సంతోష్‌నగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని హారికను గత కొన్ని రోజులుగా ఆకతాయిలు వేధిస్తున్నారు. క్రమంగా వేధింపులు ఎక్కువవుతుండటంతో భరించలేక హారిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక బస్టాండ్ ఎదుట మృతదేహంతో బంధువులు నిరసనకు దిగారు. ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




