ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు

ts1lna4dఢిల్లీ: దేశంలో ఉల్లి ధరలు మోత మోగిస్తున్నాయి.. అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ నాసిక్‌లోని లాసల్‌గావ్ లో ఉల్లి ధర రికార్డు స్థాయికి చేరింది.. ఇక్కడ క్వింటాలు ఉల్లి 4వేల 900 పలుకుతోంది.. నిన్న ఒక్కరోజే క్వింటాలుకు 4వందల రూపాయలు పెరిగింది.. రెండేళ్లుగా ఈ మార్కెట్లో ఉల్లిపాయలకు అత్యధిక ధర ఇదే.. అటు ఢిల్లీలో కిలో ఉల్లి రేటు 80రూపాయలకు చేరింది.. కొత్త పంట రాకపోవడం… డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవడంమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.. వర్షాభావ పరిస్థితులు మరో కారణమంటున్నారు..