ఆకుపాముల వద్ద యాక్సిడెంట్* – దగ్గరుండి వైద్య పరీక్షలు చేయించిన జలగం సుధీర్

మునగాల, జూన్ 03(జనంసాక్షి): మునగాల మండలం ఆకుపాముల గ్రామ క్రాస్ రోడ్ వద్ద విజయవాడ నుండి హైద్రాబాద్ వెళ్తున్న కారు మరియు మోటర్ సైకిల్ యాక్సిడెంట్ లో గాయపడిన పచ్చిపాల కోటెశ్వరరావు అనే వ్యక్తిని 108 అంబులెన్స్ లో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపటం జరిగిందని కోదాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులు జలగం సుధీర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ నియోజకవర్గ ప్రముఖ టిఆర్ఎస్ నాయకులు జలగం సుధీర్ మునగాలలో ఒక ఫంక్షన్ కు హాజరై కోదాడకు తిరుగు ప్రయాణంలో ఆకుపాముల వద్ద జరిగిన యాక్సిడెంట్ ఆగి, చూసి మునగాల పోలిస్ మరియు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించి అత్యవసర ప్రధమ చికిత్స కోసం విజ్ఞప్తి చేశారు. కోదాడ ప్రభుత్వ వైద్యులు ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు రిఫర్ చేసి పంపారని తెలిపారు. గాయపడిన వ్యక్తి కోదాడ శివారులోని ఒక ఫౌల్ట్రి ఫారంలో పనిచేస్తున్నాడని, యాక్సిడెంట్ కు కారణమైన కారును మునగాల పోలిస్ స్టేషన్ కు తరలించారని తెలిపారు. ఈ విషయంలో వెంటనే స్పందించిన మునగాల ఎస్సై ఎన్ బాలు నాయక్ కు, కోదాడ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఝాన్సికి సుధీర్ కృతజ్ఞతలు తెలిపారు.