Tuesday, 3 November 2026

ఆగస్టు 1 నుంచి 31 వరకు తల్లి పాల మాసోత్సం

కరీంనగర్‌, ఆగస్టు 1 (జనంసాక్షి) :జిల్లాలో ఆగస్టు 1 నుంచి 31 వరకు తల్లి పాల మాసోత్సావాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యా ఆరోగ్య వాఖాధికారి డాక్టర్‌ నాగేశ్వర్‌ రావు  ఒక  ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్ర మంలో భాగంగా వైద్య సిబ్బంది అంగన్‌ వాడీ, సిబ్బంది, ఐకేపీ, స్వయం సహాయక బృందాల సభ్యులు, స్వచ్చంద సంస్థల సహకా రంతో అవగాహాన సదస్సులు నిర్వహించను న్నట్లు ఆయన తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఆరోగ్య కుటుంబ శాఖ ద్వారా అమ్మ కొంగు- తల్లిపాలు విశిష్టత కార్యక్రమానికి సంబం ధించిన ప్రచార సామాగ్రిని పోస్టర్లు, కరపత్రా లు, అభినందన కార్డులు పీహెచ్‌సీల ద్వారా ప్రతి గ్రామానికి పంపించామని తెలిపారు. ప్రతి సబ్‌సెంటర్‌ అంగన్‌ వాడి, సెంటకు  వైద్య సిబ్బంది ద్వారా పంపించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిపాల విశిష్టతపై అవగాహన కలిగిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *