Wednesday, 4 November 2026

ఆగివున్న లారీని ఢీకొన్న కారు

స్పాట్‌లోనే నలుగురు మృతి
మేడ్చల్‌,మే4(జ‌నం సాక్షి ): శావిూర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామ సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులు కరీంనగర్‌ జిల్లా ధర్మపురికి చెందిన రాజు(24), సత్తెవ్వ(35), శ్రావణ్‌(12), శాలిని(12)గా గుర్తించారు. ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంగా వచ్చి ఆగివున్న లారీని చూసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.