Tuesday, 3 November 2026

ఆటోను ఢీకొన్న లారీ…ఒకరి మృతి

గుత్తి : అనంతపురం జిల్లా గుత్తి మండలం టి. కొత్తపల్లి వద్ద ఈ ఉదయం ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తొండపాడు గ్రామానికి చెందిన వెంకటయ్య (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో తొండపాడు నుంచి గుత్తికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *