Wednesday, 4 November 2026

ఆటోను ఢీకొన్న లారీ: ఒకరు మృతి

ఒంగోలు,నవంబర్‌5(జ‌నంసాక్షి): ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం బైపాస్‌ సవిూపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మోటుపల్లి మండలం కుంకుడు చెట్ల

పాలానికి చెందిన వడ్లమూడి యలమంద( 28), బి. వెంకయ్య గొర్రెలు కొనేందుకు ఆటోలో బాపట్ల వెళుతూ ఉండగా లారీ ఢీకొంది. తెల్లవారుజామున సుమారు ఐదు గంటల సమయంలో తూర్పు గోదావరి జిల్లా నరసాపురం నుండి రొయ్యల లోడుతో నెల్లూరుకు వెళుతున్న లారీ కొనిజేటి హరివిల్లు కాలనీ సవిూపంలో ఎదురుగా వస్తున్న వీరి ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న వడ్లమూడి యలమంద అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.