Monday, 2 November 2026

ఆటోలోనే నార్మల్ డెలివరీ చేసిన స్టాఫ్ నర్స్ యాకలక్ష్మి

 

 

 

 

 

 

 

 

 

గంగారం డిసెంబర్ 12 (జనం సాక్షి)
ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి అంటే భయపడే పరిస్థితులు ఉండేవి. ఆసుపత్రిలో వసతుల లేమి, సిబ్బంది ప్రవర్తన, ఇతరత్రా అంశాలు వలన ప్రభుత్వాసుపత్రి అంటే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. దీంతో ప్రభుత్వాసుపత్రిలో కాన్పు అంటే..ఒక ప్రహసనంగా భావించేవారు. అటువంటి ప్రతికూల భావం తప్పించి.. ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ సాధారణ ప్రసవాలు జరుగుతాయని ప్రజల్లో బలమైన విశ్వాసం ఏర్పడింది. ప్రభుత్వ దావకానాలో రోజురోజుకు పెరుగుతున్న సాధారణ ప్రసవాలు సంఖ్య దీనికి నిదర్శనం సోమవారం రోజున పోనుగొండ్ల గ్రామానికి చెందిన ఈసం కావేరికి (23) స్టాఫ్ నర్స్ యకలక్ష్మి ఏఎన్ఎం వెంకటలక్ష్మి ఇద్దరు కలిసి ఆటోలోనే నార్మల్ డెలివరీ చేయడం జరిగింది వీరితోపాటు హాస్పిటల్ సిబ్బంది ఆశ చంద్రకళ అటెండర్ జయేందర్ పాల్గొన్నారు