– ఓటుకు నోటు కేసుతో పార్టీ పరువు తీశారు
– కేసీఆర్ అంటే చంద్రబాబు గజగజ వణికిపోతారు
– బాబు 29సార్లు ఢిల్లీ వెళ్లింది ¬దాకోసం కాదు
– కేసుల నుండి తప్పించుకొనేందుకు వెళ్లాడు
– చంద్రబాబుకు దళితులంటే చిన్నచూపు
– కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే వ్యక్తి చంద్రబాబు
– నాకు గవర్నర్, రాజ్యసభ పదవులు కావాలని ఎప్పుడూ అడగలేదు
– చంద్రబాబు తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది
– చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలుచేసిన మోత్కుపల్లి
హైదరాబాద్, మే29(జనం సాక్షి) : చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు మోత్కుపల్లి నర్సింహులు. టీడీపీ నుంచి సస్పెన్షన్‌తో పాటూ తదనంతర పరిణామాలపై స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అంత మోసగాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఎన్టీఆర్‌ను చంపి.. టీడీపీ జెండాను లాక్కున్నారన్నారు. ఆ జెండా నందమూరి కుటుంబానిది.. రాజకీయాల్లో మొదటి నుంచి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు.. బాబుది నమ్మక ద్రోహమని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని అన్నారు. స్నేహానికి కూడా విలువ ఇవ్వకుండా.. మిత్ర ద్రోహానికి పాల్పడ్డారని, నందమూరి కుటుంబాన్ని కూడా అలాగే వాడుకుంటూ.. వాళ్ల మధ్య చిచ్చుపెట్టారన్నారు. ఇవన్నీ చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని మోత్కుపల్లి అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి నేను టీడీపీలోనే ఉన్నానని, 1983లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయి.. తెలుగుదేశంలోకి బాబు వచ్చారన్నారు. అప్పటి నుంచి కుట్రలు చేసి.. పైరవీలు చేశారన్నారు. ఆయన పెట్టిన మానసిక వేదనతోనే 20మంది టీడీపీ సీనియర్ నేతలు చనిపోయారన్నారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు కూడా అలాగే ప్రాణాలు విడిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరికి ఆత్మను కూడా అమ్ముకునే నీచమైన వ్యక్తి చంద్రబాబు అంటూ ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతే.. నేను అండగా ఉన్నా.. పదేళ్లు అధికారం లేకపోయినా వెంట ఉన్నా.. ఇప్పుడు ఎందుకు ఉన్నానా అని బాధపడుతున్నా. నాకు గవర్నర్, రాజ్యసభ పదవులు కావాలని ఎప్పుడూ అడగలేదు అని చెప్పారు మోత్కుపల్లి. ‘ఓటుకు నోటు కేసు అంటే చంద్రబాబుకు భయమని, కేసీఆర్ పేరు చెబితేనే గజ, గజ వణికిపోతారన్నారు. తెలంగాణలో పార్టీని నాశనం చేసి.. ఆ కేసులో అడ్డంగా దొరికిపోయారన్నారు. అయినా రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుండా.. ఆ దళారిని సీఎం చేయాలని ప్రయత్నించారన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి మోదీ, జైట్లీ, కేసీఆర్ కాళ్ల విూద పడ్డారన్నారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లింది ¬దా కోసం కాదని, ఈ కేసుల నుంచి బయటపడేయమని అన్నారు. కేసీఆర్ ఓ లాత్ కొడితే వెళ్లి.. అమరావతిలో పడ్డారని, ఫోన్ వాయిస్ విషయంలో కూడా అబద్ధాలు చెప్పారన్నారు. ఆ వాయిస్ తనది కాదని చెప్పగలరా అంటూ చంద్రబాబును మోత్కుపల్లి ప్రశ్నించారు. అందుకే తెలంగాణ ప్రజలు ఎప్పుడో సస్పెండ్ చేశారని నర్సింహులు అన్నారు. చంద్రబాబు కులాల మధ్య గొడవలు పెడుతున్నారని, మాలలు- మాదిగలు.. కాపులు- బీసీల మధ్య.. బ్రాహ్మణుల మధ్య కూడా పంచాయితీ పెట్టావ్ అంటూ మండిపడ్డారు. వర్గీకరణ పేరుతో దళిత జాతిని మోసం చేశావ్. చివరికి పదవుల విషయంలో కూడా బీసీలు, ఎస్సీలకు అన్యాయం చేసి.. జడ్జిల నియామకంలో కూడా పక్షపాతంతో లేఖలు రాశావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్న దళితులకు విజ్ఞప్తి చేస్తున్నా.. చంద్రబాబుకు ఎవరూ ఓట్లు వేయొద్దు. రాబోయే రోజుల్లో ఆయనకు అధికారం కూడా రాదు. బాబు ఓడిపోతే తిరుమల వెంకటేశ్వరుడ్ని కాలినడకన సదర్శించుకుంటా అంటూ
మోత్కుపల్లి పేర్కొన్నారు. ప్రత్యేక ¬దా విషయంలో కూడా చంద్రబాబు మాట మార్చారని, ముందు ప్యాకేజీకి ఓకే చెప్పి.. అసెంబ్లీలో తీర్మానం చేసి.. మోదీని ఆకాశానికి ఎత్తేశారన్నారు. తర్వాత ¬దా కావాలంటూ ఆందోళనలకు దిగారంటూ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దును ముందు స్వాగతించి.. తర్వాత తప్పుబట్టారు. నాలుగేళ్లు బీజేపీతో స్నేహం చేసి.. ఇప్పుడు మిత్ర ద్రోహం చేసి బయటకు వచ్చావ్ అంటూ విమర్శించారు. గతంలో వాజ్పెయ్ను ప్రధానిని చేశానని చెప్పుకుంటావ్.. మరి అలాంటప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్నం ఎందుకు ఇప్పించకలేకపోయావ్ అంటూ మోత్కుపల్లి ప్రశ్నించారు. ఆయనకు గుర్తింపు రావడం ఇష్టం లేదు కాబట్టే పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ఫోటో బయటికొస్తుంది.. తర్వాత మళ్లీ మాయం అవుతుంది’ అని విమర్శించారు. హైదరాబాద్‌లో రెండు బిల్డింగ్లు కట్టి గొప్పలు చెప్పుకున్నావ్. అమరావతిలోనూ అలాగే చెప్పి.. మోసం చేస్తున్నారు. ఏపీలో అవినీతి కూడా పెరిగిపోయింది. డబ్బును దోచేసి.. సింగపూర్, దుబాయ్‌లలో దాస్తున్నారు. చంద్రబాబుపై 29 కేసులున్నాయి.. అవి మళ్లీ ఓపెన్ చేసి సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరుతున్నా. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు అధికారం రాదు. 2014లో కూడా పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొని గెలిచావ్. రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఘోరీ కట్టడం ఖాయం అంటూ విరుచుకుపడ్డారు మోత్కుపల్లి.
ఆత్మను కూడా అమ్ముకొనే నీచమైన వ్యక్తి చంద్రబాబు




