హైదరాబాద్ : ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రొ.కోదండరాం అన్నారు. బచావో తెలంగాణ మిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ‘రైతాంగం సంక్షోభం-మన తక్షణ కర్తవ్యం’ అనే అంశంపై రౌంట్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లి వారిని అన్ని ఆదుకోవాలన్నారు. వ్యవసాయంరంగం బాగుంటేనే రాజకీయ, ఆర్థికరంగం సుస్థిరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కోదంరాంతోపాటు రైతు సంఘం నేతలు, నిపుణులు హాజరయ్యారు.




