Wednesday, 4 November 2026

దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం?

హైదరాబాద్, సెప్టెంబర్ 20 : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 23న దానం పార్టీలో చేరతారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి తలసాని మధ్యవర్తిత్వంతో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా తెలియవచ్చింది. దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు కొద్దికాలంగా టీఆర్‌ఎస్‌ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగమేననని దానం వర్గం చెబుతున్నట్టుగా సమాచారం. అయితే అలాంటిదేమీ లేదని దానం నాగేందర్‌ ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *