ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెక్కుల పంపిణీ……. ***రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే…..

***పక్క రాష్ట్ర రైతుల మీద ఉన్న ప్రేమ మన రాష్ట్ర రైతులపై లేదు కేసీఆర్ కు……
***ఒక్కో కుటుంబానికి 50వేల రుా. చెక్కుల పంపణీ…..
టేకుమట్ల.జూన్21(జనంసాక్షి)
రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ ఆధ్వర్యంలో గత కొన్ని నెలల క్రితం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రెండు బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణరావు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ ఛైర్మెన్ సంకెట అన్వేష్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం బాధిత రైతు కుటుంబ సభ్యులైన గుమ్మడవెల్లికి చెందిన ఆకినపల్లి మనెమ్మ, సుబ్బక్కపల్లికి చెందిన సిద్దురి సులోచనలకు ఒక్కొక్కరికి రూ. 50వేల చెక్కును అందజేశారు.ఈ సందర్బంగా గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం  బాధాకరమన్నారు.రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధర్నాల పేరుతో రైతులను మోసం చేస్తోందన్నారు.కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని ఆత్మహత్య చేసుకున్న కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి,ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమాలు మరువలేనివి………
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చేసినటువంటి ఉద్యమాలు మరువలేనివని ఈ సందర్భంగా మండల కేంద్రంలో జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిదని ఆయన సేవలను తెలంగాణ ప్రజలు,భవిష్యత్తు తరాలు గుర్తించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వైనాల రవీందర్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్, రేగొండ మండల పార్టీ అధ్యక్షుడు యిప్పకాయల నర్సయ్య,సీనియర్ నాయకుడు గూటోజు కిష్టయ్య,బోయిని మధుకర్, తదితరులు పాల్గొన్నారు.