వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి మిట్ రోమ్నీల మధ్య పోటీ నువ్వా, నేనా? అన్నట్లు కొనసాగుతోంది. ఫలితాల్లో మొదట కాస్త వెనకబడిన అధ్యక్షుడు ఒబామా ప్రస్తుతం పుంజుకొని ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకూ అందిన ఫలితాల ప్రకారం రోమ్నీకి 162 ఓట్లు రాగా … అధ్యక్షుడు ఒబామా 172 ఓట్లు సాధించారు. ఒహియో, అయోవా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఒబామా ఆధిక్యం కొనసాగుతుండగా. వర్జీనియా, విస్కానిసిస్ రాష్ట్రాల్లో రోమ్నీ ముందంజలో ఉన్నారు. అధ్యక్ష పీఠం అధిరోహించాలంటే అభ్యర్ధి 270 ఓట్లు సాధించాల్సి ఉంటుంది.




