ఫీడ్‌బ్యాక్ పనులు వేగవంతం చేయాలని సూచన
హైదరాబాద్,మే17(జనం సాక్షి ):వివిధ శాఖల్లో అందుతున్న ఆన్ లైన్ సేవలపై సంబంధించి వినియోగదారులు, వాణిజ్యవర్గాల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించే పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించి 78 ఆక్షన్‌పాయింట్స్‌కు ఫీడ్ బ్యాక్ కోసం సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై సి.యస్ సవిూక్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, లా సెక్రటరీ నిరంజన్ రావు, పరిశ్రమల శాఖ కమిషనర్ నదీమ్ అహ్మద్, పిసిబి సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, పిసిసిఎఫ్ పి.కె.ఝా తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలు, లా, కార్మిక, బాయిలర్స్, మున్సిపల్, ఫ్యాక్టరీలు, విద్యుత్, పిసిబి, అటవీ తదితర శాఖలలో 78 ఆక్షన్‌పాయింట్స్‌కు సంబంధించి సంబంధిత వినియోగదారుల నుండి ఫీడ్ బ్యాక్ కోసం చేపట్టిన కార్యక్రమాలపై సవిూక్షిస్తూ ఇప్పటికే పలు అవేర్‌నెస్ క్యాంపులు నిర్వహించామని, ప్రశ్నలపై ఆన్ లైన్ సర్వేలు చేపట్టామని తెలిపారు. శాఖల వారిగా చేపట్టిన చర్యలను తెలుసుకున్నారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్టియ్రల్ పాలసీ ప్రమోషన్(డిఐపిపి) వారు బిజినెస్ రిఫార్మ్స్ ఆక్షన్ లో భాగంగా సంస్కరణల అమలుపై పరిశ్రమల వర్గాలనుండి ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ ను సేకరిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలపై ఫీడ్ బ్యాక్ రిఫామ్స్ కు సంబంధించిన పనులు వేగవంతం చేయాలన్నారు. సంబంధిత శాఖలు తమ వినియోగదారులను నిరంతరం సంప్రదించాలని అన్నారు. డిఐపిపి వారు వాణిజ్యవర్గాలు, ఆర్కిటెక్స్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్, లాయర్ల నుండి ఫీడ్ బ్యాక్
సేకరిస్తుందని తెలిపారు. ఇవోడిబిలో 372 రికమండేషన్ ను అమలు చేసినందుకు పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖలను సి.యస్ అభినందించారు.
ఆన్‌లైన్ సేవలపై సిఎస్ సవిూక్ష




