ఆపదలో అండగా నిలుస్తున్న ఎం.పీ.కొత్త ప్రభాకర్ రెడ్డి.
దుబ్బాక 15 జూన్ ( జనం సాక్షి )
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు మెదక్ పార్లమెంటు సభ్యులు,జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాటకు చెందిన కానుగంటి రాజు కుమార్తె ప్రసన్న అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది . ప్రసన్న ఆపరేషన్ గురించి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా బుధవారం రోజున 400000 / రూపాయల ఎల్ ఓ సి ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దొమ్మట మాజీ సర్పంచ్ గన్నమనేని మోహన్ రావు,గాజులపల్లి సర్పంచ్ అప్పవారు శ్రీనివాస్ పాల్గొన్నారు.