Tuesday, 3 November 2026

ఆపిల్ నుంచి మరో మూడు ఐఫోన్లు

s8ufu3ca     ప్రముఖ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ ఆపిల్ స్పీడ్ పెంచింది. ఈ ఏడాది చివరిలోగా మరో మూడు కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్యకాలంలో అమ్మకాలు పడిపోయి సంస్థ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. మళ్లీ ఈమధ్యే పూర్వవైభవాన్ని సంతరించుకోవడంతో నూతన మోడళ్లపై కంపెనీ దృష్టి సారించినట్లు డిజిటైమ్స్ నివేదిక వెల్లడించింది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్లకు భారీ డిమాండ్ నెలకొనడంతో విక్రయాల్లో ఆపిల్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకోగలిగింది. ఇదేఊపును కొనసాగించేందుకు మరిన్ని కొత్త ఫోన్లను విడుదల చేయడానికి సంస్థ సిద్ధమవుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *