Tuesday, 3 November 2026

ఆఫ్ఘాన్‌లో అమెరికా జర్నలిస్టు హతం

5
కాబూల్‌, డిసెంబర్‌6 (జనంసాక్షి) : యోమన్‌లోని అల్‌ఖైదా తీవ్రవాదులు తమ చెరలో ఉన్న అమెరికా పాత్రికేయుడు ల్యూక్‌ సోమర్స్‌ సహా మరోవ్యక్తిని చంపివేశారు. ఈ ఇద్దరిని వారి నుంచి కాపాడేందుకు అమెరికా ప్రత్యేక కార్యనిర్వహణ దళాలు శుక్రవారం రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆ దేశ రక్షణ మంత్రి

చుక్‌ హాగెల్‌ కాబూల్‌లో పేర్కొన్నారు. అయితే, బంధీలను కాపాడేందుకు తాము చేసిన ప్రయత్నాలను ఆయన సమర్థించుకున్నారు. ”అల్‌ఖైదా తీవ్రవాదుల చేతిలో బంధీగా ఉన్న సోమర్‌ ప్రాణాలకు తీవ్ర అపాయం ఏర్పడింది. దీంతో ఆయన్ను విడిపించేందుకు మేము రక్షణ చర్యలకు దిగాల్సి వచ్చిందని” హాగెల్‌ పేర్కొన్నారు. యోమన్‌ ప్రభుత్వ సహకారంతో తమ రక్షణ దళాలు తీవ్రవాదుల చెర నుంచి బంధీలను విడిపించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన వివరించారు. ఈ దాడిలో పలువురు అల్‌ఖైదా తీవ్రవాదులు కూడా మరణించినట్టు ఆయన తెలిపారు. ఈ ఘటనలో తీవ్రవాదులు చంపివేసిన మరొకరు దక్షిణాఫ్రికా దేశానికి చెందిన వ్యక్తిగా తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *