సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దత్తు
హైదరాబాద్, డిసెంబర్6 (జనంసాక్షి) : దేశంలో సత్వర న్యాయానికి లోక్‌అదాలత్‌లు ఎంతగానో ఉపకరిస్తాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు అన్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెండో జాతీయ లోక్‌అదాలత్ శనివారం ఉదయం ప్రారంభమైంది. అందులో భాగంగానే హైదరాబాద్ హైకోర్టులో ఏర్పాటు చేసిన మెగా లోక్‌అదాలత్‌ను జ్టసిస్ హెచ్‌ఎల్ దత్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసుల పరిష్కారంలో జాప్యాన్ని అధిగమించేందుకే లోక్‌అదాలత్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గతేడాది నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 10 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని, ఈసారి ఇంకా ఎక్కువ కేసులు పరిష్కరించాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కార మవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భూ వివాదాల కేసులు కూడా లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఇరువర్గాల మధ్య సయోధ్యతో కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.





