కోహిమా : సాక్షాత్తూ హోంమంత్రే తన కారులో ఆయుధాలు, భారీగా నగదు తీసుకువెళ్తూ దొరికిపోయిన ఘటన నాగాలాండ్‌లో చోటుచేసుకుంది. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రత తనిఖీలు చేపట్టారు. వోకా జిల్లా సరిహద్దులో రాష్ట్ర హోంమంత్రి ఇమ్కాంగ్ ఎల్ ఇంచేన్ కారులో పోలీసులు భారీగా ఆయుధాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు రూ. కోటి నగదును కూడా పట్టుకున్నారు. అనంతరం హోంమంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 23న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు విస్త్రత తనిఖీలు చేపడుతున్నారు. నిన్న రాష్ట్ర రాజధాని కోహిమాలో నాగాలాండ్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి వద్ద రూ. కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.




