Thursday, 5 November 2026

ఇరాక్‌లో కారు బాంబు పేలుళ్లు… 37 మంది మృతి

బాగ్దాద్‌ : ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. బాగ్దాద్‌ సమీప పట్టణం సదర్‌లో షియా వర్గం లక్ష్యంగా ముష్కరులు కారు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 37 మంది మృతి చెందగా … పలువురు గాయపడ్డారు. సదర్‌ పట్టణంలోని ఆర్ఫీల్లీ, కియారా, ఫలాహ్‌ రహదారుల్లో కారు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయని అక్కడి పోలీసులు తెలిపారు. ఘటనాస్తలాల్లో అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *