Tuesday, 3 November 2026

ఆయుష్‌ ఉద్యోగుల ఆందోళన

విజయవాడ,మార్చి5(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని ఆయుష్‌ డిస్పెన్సరీల్లో ఖాళీగా ఉన్న పారా మెడికల్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ  ఆయుష్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం మెడికల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద మంగళవారం ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. నల్ల చొక్కాలు ధరించి దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం వెంటనే ఆయుష్‌ ఉద్యోగులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు.