Tuesday, 3 November 2026

ఆరోగ్యశ్రీ అమలు చేయట్లేదు

img_910864ఆరోగ్యశ్రీ అమలు సరిగ్గాలేదని ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాళ వైసీపీ ధర్నాకు దిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఇవాళ ధర్నాలు నిర్వహించనుంది. వైసీపీ అధినేత జగన్మోహన్‌‌ రెడ్డి ఇవాళ ఒంగోలు కలెక్టరేట్ దగ్గర ధర్నాలో పాల్గొంటారు. ఈ ధర్నాను భారీగా నిర్వహించేందుకు వైసీపీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఇది వరకు మీడియాతో మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి.. ఆరోగ్యశ్రీ పేరు మార్చినా తమకు అభ్యంతరం లేదని కానీ ఆ పథకానికి నిధులు కేటాయించట్లేదని, పేదల ఆరోగ్యం పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని జగన్ సర్కార్‌‌పై తీవ్రంగా మండిపడ్డారు. కమీషన్ వచ్చే స్కీములకు అదనంగా డబ్బులు ఇస్తున్నారని అంటూ పట్టిసీమకు 21 శాతం అదనపు నిదులు ఇచ్చారని, ఆరోగ్యశ్రీకి మాత్రం 50 శాతం నిధులు కోత పెట్టారని జగన్ ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *