ఆరోపణలకు ఆధారాలుంటే 

జనం ముందు పెట్టండి
– మోదీని విమర్శించే దమ్ము జగన్‌, పవన్‌లకు లేదు
– చంద్రబాబును విమర్వించ పబ్బంగడుపుకోవటమే వారి పని
– ఏపీ మంత్రి నారా లోకేష్‌
కర్నూలు, జులై9(జ‌నం సాక్షి) : తనపై ఆరోపణలు చేసే వారు ఆధారాలుంటే ప్రజలు ముందు పెట్టాలని, అప్పుడు ప్రజలే తన భవిష్యత్తును నిర్ణయిస్తారని, అలా కాకుండా ఇష్టానుసారంగా నోటికొచ్చిన ఆరోపణలు చేస్తే అది నిబద్దత అనిపించుకోదని ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. సోమవారం కర్నూల్‌ జిల్లాలో నారా లోకేష్‌ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధప్రదేశ్‌ లో జరుగుతున్న అభివృద్ధి చూసి కేంద్రానికి కన్ను కుట్టిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక¬దా ఇస్తామని హావిూ ఇచ్చి కేందప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. 60ఏళ్ల వయస్సులో చంద్రబాబు ఏపీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. కేంద్రం సహకారం లేకపోయినా, ప్రతిపక్షాలు అడ్డుపడ్డా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలనే ఉద్దేశంతో చంద్రబాబు కుటుంబాన్నిసైతం వదిలి కష్టపడుతున్నారన్నారు. ప్రత్యేక ¬దాపై మోదిని నిలదీసిన వ్యక్తం చంద్రబాబు అని అన్నారు.  ప్రత్యేక¬దా ఇవ్వాలని మోడీని అడిగేందుకు జగన్‌, పవన్‌ లు ఇద్దరూ వణికిపోతున్నారని ఆయన వివరించారు. చంద్రబాబు నాయుడిని వారిద్దరూ పదేపదే విమర్శిస్తున్నారు తప్ప ప్రత్యేక¬దా కోసం మోడీని నిలదీయడం లేదని వెల్లడించారు. చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌, పవన్‌లకు లేదని, చంద్రబాబును విమర్శించి ప్రజల్లో లబ్ధిపొందాలనిచూడటం వారి అవివేకమన్నారు. అవినీతికి చంద్రబాబు వ్యతిరేఖమని, అది తెలుగు ప్రజలకే కాక, దేశ ప్రజలకు తెలుసన్నారు. అసలు బీజేపీ అంటే.. భారతీయ జనతా పార్టీ, జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ పార్టీ అని అర్థం అంటూ వివరించారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే జనం ముందు పెట్టాలని లోకేష్‌ జగన్‌, పవన్‌ లకు సవాల్‌ విసిరారు. 2019 ఎన్నికల్లో కర్నూల్‌ ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యే మోహన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని లోకేష్‌ కోరారు.
—————————