అందరి సంగతి తేలుస్తాం
– 2019లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
– కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, జులై9(జనం సాక్షి) : 2019లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, అప్పుడు అందరి సంగతి తేలుస్తామని టి.కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. అక్రమ కేసులు పెట్టిన నేతలు, అధికారుల పేర్లు రాసిపెట్టుకోండని కార్యకర్తలనుద్దేశించి అన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ నేత కుంతియా, షబ్బీర్అలీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు రవి, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన కోమటిరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో యువ నేతలకు టికెట్లు ఇవ్వాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హావిూని కేసీఆర్ మరిచారని విమర్శించారు. అధికార మదంతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని, సరైన సమయంలో సరైన రీతిలో ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం, తెరాస నేతలు అప్పనంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల్లో అవినీతి
అక్రమాలకు పాల్పడ్డారని, తద్వారా ప్రజా సొమ్ముకు తమ జోబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను తమ ప్రాజెక్టులగా తెరాస చెప్పుకుంటుందని, కాంగ్రెస్ మయాంలో 90శాతం ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయ్యాయని, పది శాతం పనులు పూర్తి చేయడానికి నాలుగేళ్లు సమయం తీసుకొని ఇంకా పూర్తి చేయలేక పోయారన్నారు. తెలంగాణలోని ప్రతీ ఎకరానికి సాగునీరందించే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ప్రాజెక్టులకు బీజం వేయటం జరిగిందన్నారు. కానీ టీఆర్ఎస్ అవి మేమే చెప్పాటమని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, 2019 ఎన్నికల్లో తెరాస నేతలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు చేయాల్సింది ప్రజలకు అండగా ఉండటమేనన్నారు.
పేర్లు రాసిపెట్టండి..




